నల్గొండ జిల్లా కేంద్రంలోని జివి గూడెం వద్ద రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి ఈ నెల 4న భూమి పూజ నిర్వహించనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండ రెసిడెన్షియల్ పాఠశాలను రాష్ట్రానికే ఆదర్శంగా ఉండేలా నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ ను గురువారం ఆయన ఆదేశించారు.