నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు, డిసెంబర్ 31 రాత్రి నుండి తెల్లవారుజాము వరకు నిరంతర పర్యవేక్షణ చేయనున్నారు. ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. అతివేగంగా వాహనాలు నడిపే యువకులకు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అదుపులోకి తీసుకుంటారు.