నల్గొండ: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు రూ.10 లక్షల బీమా భరోసా

టీఎస్ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో శాలరీ అకౌంట్ ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2,200 మంది ఉద్యోగులకు రూ.10 లక్షల సహజ మరణ బీమాను వర్తింపజేయనున్నారు. దీనికి ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఉన్న కోటి రూపాయల ప్రమాద బీమాకు అదనంగా ఈ పది లక్షల భరోసా తోడవడంతో ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ నిర్ణయం ఉద్యోగులకు అండగా నిలుస్తుందని సంస్థ భావిస్తోంది.

సంబంధిత పోస్ట్