ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ ఆదేశించారు. శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ఇదే అంశంపై సమీక్ష నిర్వహించి, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.