ప్రమాదాల నివారణపై పోలీసుల అవగాహన

సోమవారం నల్లగొండ పట్టణంలోని క్లాక్‌టవర్‌ సెంటర్‌లో 'అరైవ్‌- అలైవ్‌' పేరుతో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ పాల్గొని, రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతిఒక్కరి బాధ్యత అని, వాహనదారులు ట్రాఫిక్‌ నియమాలు తప్పక పాటించాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు రోడ్డు భద్రతపై మార్గనిర్దేశం చేయాలని కోరారు. ఈ సందర్భంగా హెల్మెట్‌ వినియోగంపై పోలీస్‌ కళాబృందం, చిన్నారుల నృత్యం, యమధర్మరాజు వేషధారణతో అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్