పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందన్న వదంతులను నమ్మవద్దని నల్గొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ప్రజలకు సూచించారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని ఆయన స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లో పౌరసరఫరాల అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు.