నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ బి. శరత్ చంద్ర అధ్యక్షతన స్వచ్ఛ సర్వేక్షణ్-2026, సిటిజన్ ఫీడ్‌బ్యాక్, త్రాగునీటి సరఫరా, పారిశుధ్యం, డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం, అభివృద్ధి పనులపై సమీక్ష జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అధిక సంఖ్యలో సిటిజన్ ఫీడ్‌బ్యాక్ నమోదు అయ్యేలా మెప్మా సిబ్బంది విస్తృత ప్రచారం నిర్వహించాలని, ప్రజలకు ఫీడ్‌బ్యాక్ ప్రాముఖ్యతను వివరించాలని కమిషనర్ సూచించారు.