పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి

ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా భూసేకరణ, పునరావాస, పునర్నిర్మాణ కేంద్రాల పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రాజెక్టుల కింద చేపట్టిన భూసేకరణ, పునరావాస కేంద్రాలపై సమీక్ష నిర్వహించారు. భూసేకరణకు సంబంధించి అవార్డు దశలో ఉన్న సమస్యలను పరిష్కరించి అవార్డు పాస్ చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్