సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి, శుక్రవారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈ ఆర్ వో లు, ఏ ఈ ఆర్ వో లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. స్వచ్ఛమైన ఓటరు జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాది అని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్లు ఎలక్షన్ కమిషన్ ఇంటిగ్రేటెడ్ నెట్‌వర్క్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకునే సౌకర్యం కల్పించామని తెలిపారు.

సంబంధిత పోస్ట్