గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, నల్గొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో రిటర్నింగ్ అధికారులు తిరస్కరించిన నామినేషన్లపై వచ్చిన అప్పీళ్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో పరిశీలించారు. నల్గొండ డివిజన్ పరిధిలోని 9 మండలాల నుంచి రిటర్నింగ్ అధికారులు తిరస్కరించిన నామినేషన్లపై మొత్తం 19 అప్పీళ్లు వచ్చాయి. ఈ అప్పీళ్లపై నిబంధనల ప్రకారం ఆర్ఓల సమక్షంలో పరిశీలించి, ఆర్డిఓ రూపొందించిన జాబితాను, తీసుకున్న నిర్ణయాలను కలెక్టర్ పరిశీలించారు.