పరిశ్రమలలో పనిచేసే కార్మికుల భద్రతే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా సంక్షోభ (క్రైసిస్) కమిటీ చైర్మన్ బి. చంద్రశేఖర్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి క్రైసిస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో పలు పారిశ్రామిక యాజమాన్యాలు, ట్రాన్స్పోర్ట్, లారీ అసోసియేషన్, ఎన్ డి ఆర్ ఎఫ్, ఫైర్, పోలీస్, రెవెన్యూ, ఐఎన్టీయూసీ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. కార్మికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు, యాజమాన్యాలకు సూచించారు.