షెడ్యూల్డ్ కులాలు, తెగల వారి సమస్యల పరిష్కారానికి ఎస్సీ, ఎస్టీ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీలపై దాడులతో పాటు, అస్పృశ్యత నివారణకు కేంద్ర ప్రభుత్వం 1989లో చట్టం తీసుకువచ్చిందని, అనంతరం వివిధ చట్టాల ద్వారా వారి హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.