నారాయణపేట: ఐడీఓసీ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

శనివారం సాయంత్రం నారాయణపేట పట్టణ శివారులో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (IDOC) పనులను జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పరిశీలించారు. ఆర్ అండ్ బీ అధికారులతో కలిసి భవనమంతా తిరిగిన ఆమె, నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్, ఏఓ ఛాంబర్లకు త్వరగా కిటికీలు, తలుపులు బిగించాలని ఆదేశించారు. అనంతరం మహిళా సమాఖ్య భవననిర్మాణ పనులను కూడా ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు.

సంబంధిత పోస్ట్