పాస్‌పోర్ట్ ధృవీకరణ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. దేశంలోనే ఉత్తమ పోలీస్ ధృవీకరణ సేవలందించినందుకు గానూ తెలంగాణ పోలీసులకు ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డు ప్రకటించారు. 2025-26 పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో విశిష్ట సేవలకు కేంద్ర విదేశాంగ శాఖ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. 2026, జూన్ 19న న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు ప్రదానోత్సవం జరగనుంది. వేగవంతమైన, పారదర్శక పోలీసు ధృవీకరణ సేవలకు ఈ గుర్తింపు దక్కింది.