ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో రెడ్ టెర్రరిజం లేకుండా చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో వ్యాఖ్యనించారు. నక్సలిజం ఇప్పుడు అంతరించిపోయే దశలో ఉందని తెలిపారు. భద్రతా దళాలు, రాష్ట్ర పోలీసు బలగాలు, స్థానిక గిరిజనుల కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఎవరైనా ఆయుధాలు పడితే వారి అంతు చూస్తామని హెచ్చరించారు. గతంలో తెలంగాణ, ఏపీ, చత్తీస్‌గఢ్, కేరళ, జార్ఖండ్, యూపీతో సహా రెడ్ కారిడార్‌లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, సుమారు 12 కోట్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారని, వేలాది మంది యువకులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.