నియోపోలీస్ భూముల వేలం రద్దు

TG: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) కోకాపేటలోని నియోపోలిస్ ప్రాంతంలో 4.59 ఎకరాల భూమిని విక్రయించేందుకు నిర్వహించిన వేలానికి ఆశించిన స్పందన లభించలేదు. ఈ భూమికి కనీస ధరను రూ.120 కోట్లుగా అధికారులు నిర్ణయించారు. అయితే, వేలం ప్రక్రియలో ఒక్క బిడ్డు కూడా దాఖలు కాకపోవడంతో, అధికారులు వేలాన్ని అధికారికంగా రద్దు చేశారు. రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ వేలానికి సరైన స్పందన రాలేదని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕