దేశంలో కొత్త గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్.. మోడీ సర్కార్ మాస్టర్ ప్లాన్!

దేశంలో నిరుపయోగంగా ఉన్న వేల టన్నుల బంగారాన్ని ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడేలా మార్చేందుకు మోడీ ప్రభుత్వం కొత్త గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. వచ్చే రెండు వారాల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ కొత్త విధానంలో దేశవ్యాప్తంగా ఉన్న బంగారు నగల వ్యాపారులను కూడా 'కలెక్షన్ పార్ట్‌నర్స్'గా చేర్చే ప్రతిపాదన ఉంది. దీనివల్ల ప్రజలు తమకు దగ్గరలోని గుర్తింపు పొందిన జ్యువెలరీ షాపుల్లోనే బంగారాన్ని డిపాజిట్ చేసే వీలు కలుగుతుంది. ఈ స్కీమ్ ద్వారా బంగారం యజమానులు వడ్డీ లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. కాగా 2015లో ప్రారంభించిన పాత స్కీమ్ పెద్దగా సక్సెస్ కాలేదు.

సంబంధిత పోస్ట్