కొత్త ఆదాయపు పన్ను చట్టం: జీతభత్యాలపై ఉద్యోగుల్లో ఆందోళన

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 అమల్లోకి రానుంది. ఈ మార్పులతో జీతాల నిర్మాణంలో కీలక ప్రభావం పడనుంది. అలవెన్సులు, రీయింబర్స్‌మెంట్లు పన్ను పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. కార్మిక నిబంధనల ప్రకారం బేసిక్ జీతం 50% ఉండటంతో పీఎఫ్, గ్రాట్యుటీ పెరుగుతాయి. అయితే ఉద్యోగుల టేక్-హోమ్ శాలరీ తగ్గే అవకాశముందని నిపుణులు అంటున్నారు. కంపెనీ సౌకర్యాలపై కూడా పన్ను కఠినతరం అవుతుందని, కానీ పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడమే లక్ష్యమని పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్