కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. RBI డేట్, టైం ఫిక్స్!

దేశంలో త్వరలో ప్లాస్టిక్ (పాలిమర్) కరెన్సీ నోట్లు రానున్నాయి. క్షేత్రస్థాయి పరీక్షలు విజయవంతమైతే, వచ్చే ఆర్థిక ఏడాది మొదట్లో వీటిని చలామణిలోకి తీసుకురానున్నట్లు RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా రూ.10, రూ.20 నోట్లను మాత్రమే ఈ పాలిమర్ మెటీరియల్‌తో ముద్రించి పరీక్షిస్తారు. సాధారణ కాటన్ పేపర్ నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్లు చిరిగిపోకుండా, నీటి తేమ, మురికిని తట్టుకునేలా ఉంటాయి. ఎక్కువ కాలం మన్నే ఈ నోట్ల వల్ల ప్రభుత్వానికి ముద్రణ ఖర్చు తగ్గుతుంది.

సంబంధిత పోస్ట్