అక్టోబర్ 1 నుంచి సబ్సిడీ LPG సిలిండర్లపై కొత్త రూల్!

వంటగ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. అక్టోబర్ 1, 2026 నుంచి సబ్సిడీతో కూడిన గృహ వినియోగ LPG రీఫిల్‌లకు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ తప్పనిసరి కానుంది. సబ్సిడీ ప్రయోజనం సరైన కుటుంబాలకు చేరేలా, నకిలీ కనెక్షన్లను తొలగించడం దీని లక్ష్యం. ఇప్పటికే 89.9 శాతం మంది వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ పూర్తి చేశారు. మిగిలినవారు అక్టోబర్ 1 నుంచి సబ్సిడీ రీఫిల్ బుక్ చేసుకునే ముందు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. డెలివరీ సిబ్బంది ద్వారా, డిస్ట్రిబ్యూటర్ షోరూమ్‌లలో, లేదా మొబైల్ యాప్‌ల ద్వారా ధృవీకరణ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕