నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్లకు కొత్త రూల్స్

నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ నిబంధనలలో కీలక మార్పులు రానున్నాయి. గృహ వినియోగదారులు తప్పనిసరిగా ఆధార్ ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి సబ్సిడీ నిలిపివేసే అవకాశం ఉందని సమాచారం. వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా లేదా గ్యాస్ ఏజెన్సీలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అదనంగా, నవంబర్ 1న చమురు సంస్థలు వాణిజ్య సిలిండర్ల ధరలను సవరించే అవకాశం ఉందని అంచనా. ఈ మార్పుల గురించి సామాన్యులు ముందే అవగాహన కలిగి ఉండటం మంచిది.

సంబంధిత పోస్ట్

✕
✕