ఆన్‌లైన్ గేమింగ్‌కు కొత్త నిబంధనలు.. మే 1 నుంచి అమలు

భారత్‌లో డబ్బులతో కూడిన ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. గత సంవత్సరం ఆమోదం పొందిన ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్‌ను అమలు చేసేందుకు ఈ రూల్స్ రూపొందించారు. ఈ కొత్త నిబంధనలు మే 1, 2026 నుండి అమలులోకి వస్తాయి. ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. రియల్ మనీ గేములు కాని వాటికి రిజిస్ట్రేషన్ అవసరం లేదని, అయితే ఇ-స్పోర్ట్స్ గేమ్స్‌కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఐటీ శాఖ సెక్రెటరీ ఎస్ కృష్ణన్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్