దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి టెర్మినల్ నుండి గోరఖ్‌పూర్ జంక్షన్ మధ్య నూతన ‘అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్’ (22075/22076) వారపు రైలును 2026 అక్టోబర్ 2వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ప్రతి శుక్రవారం రాత్రి 9:45 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి ఆదివారం ఉదయం 6:25కి గోరఖ్‌పూర్ చేరుకుంటుంది. ఈ రైలు తెలంగాణలోని కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల స్టేషన్లతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణిస్తుంది. పుష్-పుల్ టెక్నాలజీ, సీల్డ్ గ్యాంగ్‌వేలు, ఛార్జింగ్ పాయింట్లతో కూడిన నాన్-ఏసీ స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి. ఈ సర్వీసు హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లే వలస కార్మికులు, ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది.