చైనాలో HMPV వైరస్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై ఆరోగ్య శాఖ జాయింట్ మానిటరింగ్ గ్రూప్ ఏర్పాటు చేసింది. చైనాలో ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. దీనిపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థకు విజ్ఞప్తి చేసింది. ఈ శ్వాసకోశ సంబంధ ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇప్పటివరకు చైనాలో పరిస్థితి అసాధారణంగా లేదని తెలిపింది.