TG: హైదరాబాద్‌లోని ప్రయాణీకులకు మెట్రో సంస్థ శుభవార్త చెప్పింది. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని రేపు అర్థరాత్రి 12.30 గంటల వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. మెట్రో రైలు సమయాన్ని పెంచడంతోపాటు ఆ సమయంలో భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపింది. మెట్రో రైలు స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందని, ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది.