జాతీయ రహదారులపై నిర్మించే వంతెనల నాణ్యత, మన్నిక పెంచేందుకు NHAI కీలక నిర్ణయం తీసుకుంది. వంతెనల నిర్మాణానికి ముందే సాంకేతిక అధ్యయనాలు నిర్వహించే విధంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందుకోసం దేశంలోని 12 ఐఐటీలతో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోనుంది. అన్ని ప్రాజెక్టుల్లో ఒకే విధమైన నాణ్యతా ప్రమాణాలు అమలయ్యేలా ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించనున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కనీసం 100 ఏళ్ల మన్నిక కలిగిన వంతెనల నిర్మాణమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.