గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బృందం చేరుకొని ఆధారాలు సేకరిస్తోంది. NIA పరిశీలనలో మరో మృతదేహం బయటపడ్డట్లు తెలుస్తోంది. కుట్రకోణం ఉందనే అనుమానంతో విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 274కు చేరగా.. విమానంలోని 241 మందితోపాటు బీజే మెడికల్ కాలేజీకి చెందిన 33 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.