జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు, ప్రజల భద్రత కోసమే కార్డెన్ సెర్చ్ లు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 75 ద్విచక్ర వాహనాలు, ఐదు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. రూ. 42,380 పెండింగ్ చలాన్లు వసూలు చేశారు. గ్రామస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించి, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ కృష్ణ, ఎస్సై శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.