అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కడెం మండల బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని ఉడుంపూర్ గ్రామంలో 2 రోజుల క్రితం కురిసిన వర్షానికి నేల కోరిగిన వరి పొలాలను పరిశీలించారు. ఉడుంపూర్తో పాటు పలు గ్రామాల్లో చేతికొచ్చిన వరి పంట నేలకొరిగి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందన్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.