నిర్మల్ జిల్లా, ఖానాపూర్ నియోజకవర్గం, జన్మారం మండలం, తిమ్మాపూర్ గ్రామానికి చెందిన దర్శనాల లలిత అనే మహిళ తన భర్త పేరు మీద ఉన్న సర్వే నెంబర్ 81 లో 1.4 ఎకరాల 4 గుంటల భూమికి సంబంధించి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. 2024-2025-2026 సంవత్సరాలకు గాను ఎంసీ ఫీజు చెల్లించినప్పటికీ, 2026 జూన్ 11న సర్వేయర్ అధికారి హద్దులు చూపించకుండానే వెళ్లిపోయారని ఆమె తెలిపారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బోజ్జు పటేల్ ను ఆశ్రయించగా, ఆయన జన్మారం తహసిల్దార్ కు న్యాయం చేయమని ఆదేశించినా, ఇప్పటికీ న్యాయం జరగలేదని లలిత వాపోయారు.