మారుమూల ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గోడం నగేష్ అన్నారు. మంగళవారం పెంబి మండల కేంద్రంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా 1 కోటి 56 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేడమ బొజ్జ, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తదితరులు పాల్గొన్నారు.