నిర్మల్ జిల్లా పెంబిలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యతతో సంపాదన విలువ తెలుసుకుంటామని, భవిష్యత్ ప్రణాళికలో ఇది కీలకమని పేర్కొన్నారు. కుటుంబ ఖర్చుల్లో క్రమశిక్షణతో పొదుపు చేయాలని, బ్యాంకు సేవలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.