నిర్మల్ జిల్లా రాజ్ గోండ్ సేవ సమితి అత్యవసర సమావేశం 06/12/2025 శనివారం ఉదయం 9 గంటలకు కొత్త మైసంపేట్ గోండు గూడాలో నిర్వహించబడుతుంది. ఈ సమావేశానికి జిల్లా కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, పటేల్ దేవరులు అందరూ హాజరు కావాలని కమిటీ పిలుపునిచ్చింది. ఈ విషయాన్ని జిల్లా అధ్యక్షుడు ఆత్రం రాజేశ్వర్, ఉపాధ్యక్షుడు మారుస్కోలా భీంరావ్, ప్రధాన కార్యదర్శి ఆత్రం భీంరావ్, గౌరవ అధ్యక్షుడు అర్కా మధు తెలిపారు.