బాధితులకు న్యాయం చేయాలి: ఎస్పీ

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. బుధవారం బైంసా పట్టణంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి తమ అర్జీలను ఎస్పీకి సమర్పించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. గతంలో స్వీకరించి పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను కూడా వేగంగా పరిష్కరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్