బడ్జెట్‌లో పార్ట్-బిపైనే నిర్మలా సీతారామన్ దృష్టి

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి వార్షిక పద్దులో పార్ట్-ఎ కంటే పార్ట్-బిపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. సాధారణంగా పార్ట్-ఎలో దేశ ఆర్థిక స్థితిగతులు, గణాంకాలు, విధాన ప్రకటనలు ఉంటాయి. పార్ట్-బిని పన్ను ప్రతిపాదనలు, సాంకేతిక ప్రకటనలకు పరిమితం చేసేవారు. అయితే ఈసారి మంత్రి సుదీర్ఘంగా పార్ట్-బిని చదవనున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పు బడ్జెట్ ప్రవేశపెట్టే విధానంలో కొత్త ఒరవడిని సృష్టించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్