*నర్సింగ్ కాలేజ్ ను సందర్శించిన కలెక్టర్*

మాక్లూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న ప్రభుత్వ నర్సింగ్ కాలేజీని కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం సందర్శించారు. కాలేజీ ఆవరణలో ప్రహరీ లేకపోవడాన్ని గమనించి, వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, నర్సింగ్ కాలేజీ వద్ద, పరిసర ప్రాంతాలలో పోలీసులు పెట్రోలింగ్ చేసేలా చూడాలని సూచించారు. తుది దశలో ఉన్న నిర్మాణ పనుల నాణ్యతను తనిఖీ చేసి, యుద్దప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్