హనుమాన్ జయంతి సందర్భంగా, నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో 24 గంటల పాటు వైన్ షాపులను మూసివేయాలని ఎస్సై ఎస్ సోమ శ్రీనివాస్ ఆదేశించారు. గురువారం ఉదయం 6 గంటల నుండి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. మండలంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ సహకరించాలని ఎస్సై కోరారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది కూడా ఎస్సైతో పాటు ఉన్నారు.