ఆర్మూర్ మున్సిపల్ నూతన కమిషనర్ గా ఎం. రవిబాబు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం నూతన మున్సిపల్ కమిషనర్‌గా ఎం. రవిబాబు బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. గతంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన రవిబాబు, ఆర్మూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నిలుపుతానని అధికారుల సంపూర్ణ సహకారంతో కృషి చేస్తానని తెలిపారు. గత కమిషనర్ రాజు లంచం కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో రవిబాబు బాధ్యతలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్