కమ్మర్ పల్లి మండల కేంద్రంలో 108 సేవల సిబ్బంది వేసవి తాపాన్ని తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారని సర్పంచ్ కొత్తపల్లి హారికకు తెలపగా, ఆమె వెంటనే స్పందించి 108 సిబ్బంది కార్యాలయంలో కూలర్ ను ఆదివారం వితరణ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొత్తపల్లి హారిక, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ మాట్లాడుతూ, కమ్మర్ పల్లితో పాటు చుట్టుపక్కల మండలాలకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న 108 సిబ్బంది ప్రాణాలను కాపాడుతున్నారని కొనియాడారు.