వేల్పూర్ మండల కేంద్రంలో ఆదివారం హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సంస్థ వేల్పూర్ ఆధ్వర్యంలో పడగల్ గ్రామానికి చెందిన అఫ్తాబ్ కుటుంబ సభ్యులకు రూ. 5000 ఆర్థిక సహాయం అందజేశారు. సంస్థ వారు మాట్లాడుతూ బాధిత వ్యక్తికి ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం దాతల కోసం ఎదురు చూస్తూ ఉండగా తమ సేవా సంస్థ బాధిత వ్యక్తి గురించి తెలుసుకొని తమకు తోచిన సహాయం అందించి వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించడం జరిగిందన్నారు.