ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో వాహనాల తనిఖీని పకడ్బందీగా చేపట్టాలని ఎంపీడీవో శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన అంతర్రాష్ట్ర సరిహద్దులో చేపడుతున్న వాహనాల తనిఖీని పరిశీలించి, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు. సాలంపాడ్లోని నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి, అభ్యర్థులకు సమాచారం అందించి, తప్పులను సరిదిద్దామని, నామినేషన్ పత్రాల పరిశీలన పకడ్బందీగా చేపట్టామని వివరించారు. ఆయన వెంట ఎస్ఎన్టీ అధికారులు రఘువీర్, ముఖీం, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్