కంట తడిపెట్టిన సబ్ కలక్టర్

బాన్సువాడ సబ్ కలెక్టర్ కొప్పిషెట్టి కిరణ్మయి రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆమెకు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. రెండు సంవత్సరాల కాలంలో ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ప్రతి వ్యక్తిని తన కుటుంబ సభ్యునిగా భావించి వారి సమస్యలను తన సమస్యలుగా స్వీకరించిన కిరణ్మయి, ఈ ప్రాంతంలో తక్కువ సమయంలోనే అందరి మన్ననలు పొందారు. ఆమె కార్యాలయం నుండి బయటకు వెళ్లేంతవరకు సిబ్బంది పూల వర్షం కురిపిస్తూ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆమె సిబ్బంది చూపిన ఆదరణకు భావోద్వేగానికి లోనయ్యారు.

సంబంధిత పోస్ట్