గోదావరి పుష్కర ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలి

వచ్చే ఏడాది జూలైలో జరుగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో, కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. మంగళవారం రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్‌ను సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. పక్షం రోజుల క్రితం సందర్శించినప్పుడు అప్పగించిన పనులను అధికారులు ఎంతవరకు పూర్తి చేశారో క్షేత్రస్థాయిలో ఆమె పరిశీలించారు.

సంబంధిత పోస్ట్