నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య బోధన్ ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని, పాత నేరస్తులను గుర్తించి బైండోవర్ చేయాలని సూచించారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో కనీస వసతులు కల్పించాలని, ఏసీపీ కార్యాలయంలోని రికార్డులు, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, ప్రతి కేసుకూ ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.