బోధన్ సాలూర మండలం హున్స గ్రామ శివారులోని మంజీరా నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదానికి దారితీశాయి. మహారాష్ట్ర కాంట్రాక్టర్లు బోలేగావ్ క్వారీ పేరుతో తెలంగాణ సరిహద్దుల్లోకి చొరబడి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో, బుధవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ వ్యవహారంపై దృష్టి సారించారు.