బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మెహతో శుక్రవారం మోస్రా మండలం గోవూర్ గ్రామ జిల్లా పరిషత్ పాఠశాల, ఎంపీపీఎస్ పాఠశాలలను సందర్శించారు. ఆయన మిడ్ లైన్ బేస్ లైన్ పరీక్ష పత్రాలను పరిశీలించి, పాఠశాల నివేదికలను సమీక్షించి విద్యార్థుల ప్రతిభను అంచనా వేశారు. విద్యా ఫలితాలను మెరుగుపరచడంతో పాటు సమగ్ర విద్యా నైపుణ్యాల అభివృద్ధికి విలువైన సూచనలు అందించారు.