ఎడపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని వీక్లీ మార్కెట్ పక్కన ఉన్న స్థలాన్ని కొందరు కబ్జా చేయడంతో, బుధవారం గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్, ఉప సర్పంచ్ మజ్కూరు గంగాధర్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువైన స్థలాన్ని అక్రమంగా కొందరికి అప్పగించడాన్ని నిరసిస్తూ, స్థలాన్ని ఎవరు కబ్జా చేయరాదని తెలుపుతూ ఫ్లెక్సీ బోర్డును అతికించారు.