రోడ్డు భద్రతపై ధర్పల్లిలో అవగాహన, రూ.10,000 జరిమానా హెచ్చరిక

ధర్పల్లి మండలంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఆవరణలో ప్రజలకు రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని, అలా చేస్తే రూ.10,000 వరకు జరిమానా విధించబడుతుందని ఎస్సై సామ శ్రీనివాస్ సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని కూడా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్