ధర్పల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను 30 పడకల నుండి 100 పడకల ఏరియా ఆసుపత్రిగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. అన్ని వసతులతో కూడిన నూతన భవన నిర్మాణానికి రూ. 33.15 కోట్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ బుధవారం ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు.