ప్రజావాణికి 128 ఫిర్యాదులు

సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 128 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్డీఓ సాయన్న, డీపీఓ శ్రీనివాస్ రావు, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డిలకు ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

సంబంధిత పోస్ట్